ఏలూరు సర్వజనాసుపత్రిలో ఆకస్మిక తనిఖీ

వార్డుల్లో అపరిశుభ్రతపై ఎంపీ పుట్టా మహేష్ ఆగ్రహం

ఏలూరు, మహానాడు: ఏలూరు సర్వజనాసుపత్రిని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. రోగుల వార్డుల్లో నెలకొన్న దోమలు, అపరిశుభ్రతపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులను పరామర్శించి, వైద్యం అందుతున్న తీరును తెలుసుకున్నారు. ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ని పిలిచి వారం రోజుల్లో ఆసుపత్రిలో పరిశుభ్రత పెంచాలన్నారు. ఆస్పత్రికి కావలసిన అన్నిరకాల వైద్యపరికరాల వివారాలు, అంచనా వ్యయం శాంతినగర్లోని ఎంపీ కార్యాలయంలో అందజేయాలన్నారు.