– ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
పుట్టపర్తి, మహానాడు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే పల్లెలకు పండుగ కళ వచ్చిందని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. పండుగ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం పెడబల్లి వెంకట గారిపల్లి, జగరాజు పల్లి పంచాయతీల్లో రూ. కోటి 10 లక్షలతో మంజూరైన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో మౌలిక వసతులు కల్పన కోసం ప్రభుత్వం ముందడుగు వేస్తోందని తెలిపారు. పుట్టపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.20 కోట్లు మంజూరు అయినట్టు తెలిపారు.
పెడబల్లి, సుబ్బరాయన పల్లి, వెంకటగారిపల్లి, జగరాజుపల్లి లో అనారోగ్యంతో బాధపడుతున్న పలు కుటుంబాలను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పరామర్శించి బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ విజయకుమార్, టీడీపీ నాయకులు శ్రీరామ్ నాయక్, బోమ్మయ్య, శ్రీరామ్ రెడ్డి, పుల్లప్ప, నాగరాజు, మహేష్, మురళి, కృష్ణారెడ్డి, టీడీపీ జన సేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.