మద్దిశెట్టిని కలిసిన టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి
శివప్రసాద్ అభ్యర్థిత్వంపై ఇప్పటికే అసంతృప్తి
టీడీపీకి మద్దతుపై రెండు రోజుల్లో నిర్ణయం
ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు: దర్శి తెలుగుదేశం పార్టీలో అనుహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ను గొట్టిపాటి లక్ష్మి కలిసి చర్చలు జరిపారు. ఇక్కడ వైసీపీ టికెట్‌ను మద్దిశెట్టిని కాదని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతకాలంగా మద్దిశెట్టి అసంతృప్తితో ఉన్నారు. బుధవారం గొట్టిపాటి లక్ష్మి టీడీపీ నేతలు డాక్టర్ లలిత్, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, నగర పంచాయతీ చైర్మన్ పిచ్చయ్యలతో కలిసి మద్దిశెట్టి వేణుగోపాల్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తనకు సీటు ఇవ్వకుండా శివప్రసాదరెడ్డికి ఇవ్వడంపై తొలి నుంచి వ్యతిరేకిస్తున్న మద్దిశెట్టి తెలుగుదేశానికి మద్దతు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో గొట్టిపాటి లక్ష్మి ఆయన నివాసానికి వెళ్లి మద్దతు కోరారు. దీనిపై మద్దిశెట్టి వేణుగోపాల్ సానుకూలంగా స్పందించారని, త్వరలో తన అనుచరులతో మాట్లాడి చెబు తానని హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామం దర్శి నియోజక వర్గంలో చర్చనీయాంశంగా మారింది.