-నరక యాతనలో నగర ప్రజలు
-పరిశీలించిన టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని
గుంటూరు, మహానాడు: టీడీపీ ప్రభుత్వం రాగానే అసంపూర్తి వంతెనలను, రహదారులను పూర్తిచేసి సమస్యలు పరిష్కరిస్తామని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నగరంలో అసంపూర్ణంగా ఆగిన వంతెనల నిర్మాణాలను బుధవారం పరిశీలించారు. ప్రస్తుత ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. శ్యామలా నగర్, గుంటూరు-నందివెలుగు రోడ్డు, శంకర్ విలాస్ దగ్గర 75 ఏళ్ల పురాతన వంతెనలను పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నో ప్రయత్నాలు చేసినా జగన్ ప్రభుత్వం సహకారం లేక ఆగిపోయాయని విమర్శించారు. టీడీపీ రాగానే త్వరితగతిన వంతెనల నిర్మాణాలు కార్యరూపం దాల్చేలా పాటుపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పోతురాజు సమత, ఈరంటి హరిబాబు, వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.