ప్రభుత్వ ఆస్పత్రిల్లో నిరాటంకంగా రోగులకు సేవలు

– మంత్రి దామోదర్ రాజనర్సింహ

హైదరాబాద్‌, మహానాడు: ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో రోగుల సంరక్షణ సేవలు నిరాటంకంగా సాగుతున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గురువారం తెలిపారు. ఆస్పత్రి పనితీరుకు ఆటంకం కాకుండా పారదర్శకంగా బదిలీలు చేపట్టామన్నారు. ఇంకా ఆయన మాట్లాడూతు… దీర్ఘకాలికంగా ఒకే చోట ఉద్యోగ విధులను నిర్వహిస్తున్న 40% ఉద్యోగుల సర్వీసును గుర్తించి వారిని బదిలీలు చేశాం.

ఈ బదిలీల వల్ల ఆసుపత్రి పనితీరుకు, రోగుల సంరక్షణ సేవలకు ఏ విధంగా ఆటంకం కలగకుండా బదిలీలను పారదర్శకంగా చేపట్టాం. జీవో నెంబర్ 80 ప్రకారం సూపర్ స్పెషాలిటీ సేవలలో అత్యవసరత ను పరిగణలోకి తీసుకొని ఈ బదిలీల్లో స్పెషాలిటీ డాక్టర్లకు మినహాయింపు ఇచ్చాం.

వైద్యులు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ను కాంట్రాక్టు పద్ధతిన మార్చి 2024 లో నియమించాం. వీటితోపాటు ఆగస్టు 9వ తేది.2024 న వైద్యులు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లను కాంట్రాక్టు పద్ధతిన నియమించుకోవడానికి మళ్లీ షెడ్యూలు విడుదల చేశాం. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులలో తగిన సంఖ్యలో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఉండి రోగుల సంరక్షణ సేవలను అందిస్తున్నారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్న డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు సంఖ్యను గత ఏడాది 2023 ఆగస్టు ఏడోతేదీకి ఈ ఏడాది ఏడో తేదీ వరకు మధ్య తేడా ఈ క్రింది విధంగా ఉంది.

ఉస్మానియా ఆసుపత్రిలో:

Date.07.08.2023 వ తేదీన ఉన్న ఉద్యోగులు ;
డాక్టర్లు – 169.
జూనియర్ రెసిడెంట్లు – 69.
పోస్ట్ గ్రాడ్యుయేట్లు – 1638.
నర్సింగ్ ఆఫీసర్ లు – 247.
మొత్తం. 2123 .

Date.07.08.2024 వ తేదీన ఉన్న ఉద్యోగులు.

డాక్టర్లు – 266.
సీనియర్ రెసిడెంట్లు – 218.
పోస్ట్ గ్రాడ్యుయేట్స్ – 1638.
నర్సింగ్ ఆఫీసర్లు – 263.
మొత్తం. 2385.

గాంధీ ఆసుపత్రిలో:

Date.07.08.2023 వ తేదీన ఉన్న ఉద్యోగులు ;

డాక్టర్లు – 295.
జూనియర్ రెసిడెంట్లు – 51.
పోస్ట్ గ్రాడ్యుయేట్లు – 723.
నర్సింగ్ ఆఫీసర్ లు – 191
మొత్తం. 1260.

Date.07.08.2024 వ తేదీన ఉన్న ఉద్యోగులు .

డాక్టర్లు – 362
సీనియర్ రెసిడెంట్లు – 119.
పోస్ట్ గ్రాడ్యుయేట్స్ – 723.
నర్సింగ్ ఆఫీసర్లు – 287.
మొత్తం. 1491 .

ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో సూపర్ స్పెషాలిటీ, బ్రాడ్ స్పెషాలిటీ సేవలు జీవో. ఆర్టీ. నెం.80 ప్రకారం నిర్వహించిన సాధారణ బదిలీలలో ఏ రకమైన ప్రభావానికి గురికాలేదు. రోగుల సంరక్షణ సేవలను నిరాటంకంగా కొనసాగిస్తున్నాం.