దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని కేంద్ర సహాయమంత్రి తెలంగాణకు చెందిన బండి సంజయ్‌ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఈవో స్వాగతం పలికారు. ఏపీకి చెందిన మంత్రి కందుల దుర్గేష్‌ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈవో స్వాగతం పలికారు. వేదపండితులు, అర్చ కులు ఆశీర్వచనం చేశారు. ఈవో అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రాలు, చిత్రపటం అందజేశారు.