అద్వానీ కి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభినందనలు

కేంద్ర మాజీ హోంమంత్రి, బీజేపీ అగ్రనేత, రాజనీతిజ్ఞుడు, గురుతుల్యులు లాల్ కృష్ణ అద్వానీ కి భారతరత్న అవార్డును ప్రకటించిన సందర్భంగా వారికి హృదయపూర్వక అభినందనలు. పారదర్శకత, సమగ్రతతో పాటుగా విలువలను పాటిస్తూ దశాబ్దాల పాటు కొనసాగిన వారి ప్రజాజీవితం మార్గదర్శనీయం. వారితో కలిసి నడిచిన ప్రతి క్షణం.. ఓ కొత్త విషయాన్ని నేర్పుతుంది. అద్వానీ కి భారతరత్న ప్రకటించిన ప్రధానమంత్రి మోదీ కి ఈ సందర్భంగా ధన్యవాదములు.