ఆర్య వైశ్య సంఘాల నాయకులు, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఆర్య వైశ్య నాయకులు ఆధ్వర్యంలో వరద బాధితులకు రూ. 50 వేలు విరాళం ప్రకటించారు. ఆ డీడీని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణకి మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చౌట శ్రీనివాసరావు, దివ్వెల శ్రీనివాసరావు, పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు మద్ది వెంకటేశ్వరరావు, నాయకులు దేవరపల్లి కాశీ, బాలనాగు శివ కోటేశ్వరరావు, కాకరపర్తి సుబ్రమణ్యం, అన్నం బాల సుబ్రమణ్యం, పెండ్యాల కాశీ మల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.