మాచర్ల, మహానాడు : అడిగొప్పల గ్రామంలో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన 20 వైసీపీ కుటుంబాల వారు శనివారం ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. వారికి మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమెర దుర్గారావు, చల్లా సాయిశంకర్, చల్లా పెద్దిరాజు పాల్గొన్నారు.