టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్
విజయవాడ, మహానాడు: కృష్ణా జిల్లా నుంచి ఎంతో మంది మహానుభావులు రాజకీయ, సినిమా రంగాల్లో అగ్రస్థానంలో కొనసాగారని, వారు చేసిన మంచి పనుల వల్ల కృష్ణా జిల్లా అంటే దేశంలోనే ఎంతో గౌరవం ఉండేదని, అటువంటి జిల్లా ప్రతిష్ట వైకాపా నాయ కుల తీరుతో దిగజారిపోయిందని మాజీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించా రు. ఆదివారం సాయంత్రం 12వ డివిజన్ పప్పుల మిల్లు సెంటర్లోని మెగా ఎస్టేట్ వాసులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో బొప్పన భవకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం అమరావతిని వైపాకా పాలకులు సర్వనాశనం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా, కేశినేని చిన్నిని ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పొట్లూరి సాయిబాబు, శాయన బుజ్జి, ముమ్మనేని ప్రసాద్, మెగా ఎస్టేట్స్ అధ్యక్షుడు యలవర్తి శేషగిరి, కొల్లి నరేంద్ర, కొల్లిపర సుబ్రమణ్యేశ్వరరావు, కామినేని రవి, వై.సురేష్, సబ్బినేని సాంబశివ రావు తదితరులు పాల్గొన్నారు.