రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వారధి కార్యక్రమం సోమవారం విజయవాడ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగింది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శిలు ముని సుబ్రహ్మణ్యం, బాలకృష్ణ యాదవ్, వారధి రాష్ట్ర కో ఆర్డినేటర్ కిలారు దిలీప్ పాల్గొన్నారు. తదనంతరం వారధి కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ కి, 2014 సంవత్సరంలో సత్యవేడు మండలంలో ఏడు కోట్లతో నిర్మించిన ప్రభుత్వ హాస్పిటల్ అప్ గ్రేడ్ కొరకు, సిబ్బంది నియామక పరిష్కారానికి వారి దృష్టికి తీసుకువెళ్ళారు.