డీజీపీకి వర్ల రామయ్య లేఖ

మంగళగిరి, మహానాడు: రాష్ట్రంలో ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘనటలపై ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తాకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య శుక్రవారం లేఖ రాశారు. ఇప్పటికే దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసిందని గుర్తుచేశారు. హింసకు పాల్పడిన వారిపై ఐపీసీ, ఇతర చట్టబద్ధమైన కేసులతో ఎఫ్‌ఆర్‌ నమోదు చేయాలి. ఎన్నికల నాడు, మరుసటి రోజు జరిగిన కొన్ని హింసాత్మక ఘనటలకు సంబంధించిన వాటిని మీకు అందజేస్తున్నాం. కొందరు పోలీసు అధికారులు ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించలేదు. వైసీపీ నాయకులతో కలిసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారనేందుకు క్షేత్ర స్థాయిలో చోటు చేసుకున్న ఘటనలు, పరిస్థితులు, మీడియాలో వచ్చిన కథకాలే నిదర్శనం. ఈ ఘటనలపై నిప్షాక్షికంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కౌంటింగ్‌ రోజున పోలీసు అధికారులు తటస్థ వైఖరితో విధులు నిర్వహించేలా, ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను పాటించే లా చేయాలని కోరారు.