డీజీపీకి వర్ల రామయ్య లేఖ

మంగళగిరి, మహానాడు: దళితుడైన నోముల మాణిక్యారావుపై దాడి ఘటనపై డీజీపీకి టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మంగళవారం లేఖ రాశారు. దళితుడైన నోముల మాణిక్యారావును, ఆయన కుటుంబంపై జరిగిన దాడి గురించి ఇది వరకే ఫిర్యాదు చేశామని తెలిపారు. మంగళగిరి రూరల్‌ స్టేషన్‌లో హత్యాయత్నంపై ఆధారాలు ఇచ్చినా 307 సెక్షన్‌ను చేర్చలేదని తెలిపారు. ఎన్నికల ఏజెంటుగా కూర్చున్నందుకే మాణిక్యారావును హత్య చేసేందుకు దాడి చేశారని వివరించారు. ఎస్‌ఐకు వైసీపీ నేతలతో ఉన్న సంబంధాలతోనే హత్యాయత్నం కేసు పెట్టలేదన్నారు. 307 సెక్షన్‌ చేర్చేలా ఆదేశాలు ఇవ్వాలని, వివక్షపూరితంగా వ్యవహరిస్తున్న ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని కోరారు.