వర్రా రవీంద్రా రెడ్డికి వైసీపీ నుంచే ప్రాణ హాని!

– పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జి బీటెక్ రవి సెల్ఫీ వీడియో రిలీజ్

పులివెందుల, మహానాడు: వర్రా రవీంద్ర విషయంలో వైసీపీ డ్రామాలు ఆడుతోంది. వైసీపీ వాళ్ళే సోషల్ మీడియాలో లీకులు ఇస్తూ అరెస్టు చేశారు అంటారు… వాళ్ళే తప్పించుకున్నాడు అని పోస్టులు చేస్తున్నారు. వైసీపీ నుంచే అతని ప్రాణానికి హాని ఉందని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పులివెందుల ఇన్‌ఛార్జి బీటెక్ రవి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అతనికి ప్రాణ హాని కలిగించి ఆ నేపాన్ని ఆంధ్రా పోలీసుల మీద, టీడీపీ కూటమి మీద నింద వెయ్యలని చూస్తున్నారు. వర్రా రవీంద్రా విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారణ చేయాలని. రాఘవ రెడ్డి పాత్ర కీలకమైనది. గతంలో వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా కీలకంగా ఉన్నాడు. వర్రా రవీంద్ర రెడ్డి రాఘవ రెడ్డితో ఫోన్ టచ్ లో ఉన్నాడు. పోలీసులు నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన అదుపులోకి తీసుకోవాలి.