సీఎం రేవంత్‌కు వేములవాడ అర్చకుల ఆశీర్వచనం

హైదరాబాద్‌, మహానాడు: ప్రభుత్వ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వేములవాడ ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించారు. వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్ లో రూ. 50 కోట్లు కేటాయించినందుకు సీఎంకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ విస్తరణకు సంబంధించిన డిజైన్స్, నమూనా కు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని సీఎంకు ఆలయ అర్చకులు తెలిపారు. వెంటనే వెళ్ళి శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఆలయ ఈవో వినోద్, స్థపతి వల్లినాయగం, ఈఈ రాజేష్, డీఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ, తదితరులు ఉన్నారు.