– ముందే చెప్పిన ‘మహానాడు’
– మరి టీవీ5 నాయుడుకు చైర్మన్ ఇస్తారా?
(అన్వేష్)
తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓగా కేంద్ర సర్వీసులకు చెందిన ఐఆర్‌ఎస్ అధికారి చిరుమామిళ్ల వెంకయ్యచౌదరి నియమితులయ్యారు. డెప్యుటేషన్‌పై వచ్చిన ఆయన ఆ పదవిలో మూడేళ్లు కొనసాగుతారు. దీనికి సంబంధించి వెంకయ్యచౌదరి డెప్యుటేషన్‌పై, కేంద్రం మంగళవారం ఆమోదముద్ర వేసింది. ఇదిలాఉండగా.. వెంకయ్యచౌదరిని టీటీడీ జేఈఓగా నియమించనున్నట్లు, ఈనెల 12 నాటి ‘మహానాడు’ ఈ-పేపర్‌లో వార్తా కథనం వెలువడిన విషయం తెలిసిందే. తాజాగా వెంకయ్యచౌదరి నియామకంతో, మహానాడు జోస్యం నిజమయినట్టయింది.
కాగా ఈనెలాఖరుకు టీటీడీ చైర్మన్ పదవిని కూడా ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆ మేరకు టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడుకు ఆ పదవి దక్కుతుందన్న ప్రచారం వినిపిస్తోంది. నిజానికి ఎన్నికల ముందే ఆయనకు ఆమేరకు హామీ లభించిందంటున్నారు.
అయితే ఇప్పుడు జేఈఓగా, కమ్మ సామాజికవర్గానికి చెందిన వెంకయ్య చౌదరిని నియమించినందున.. చైర్మన్‌గా మళ్లీ అదే సామాజికవర్గానికి చెందిన నాయుడును నియమిస్తారా? అన్న సందేహం తెరపైకి వస్తోంది. ఒకవేళ గత ప్రభుత్వంలో జవహర్‌రెడ్డి ఈఓ, ధర్మారెడ్డి జేఈఓగా ఉన్నప్పుడు సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి చైర్మన్లుగా పనిచేసినందున.. నాయుడు నియామకంపై అభ్యంతరాలు ఎందుకన్న భావనతో, విమర్శలను లెక్కచేయకుండా, ఆయననే ఖరారు చేస్తారా చూడాలని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.