మెదక్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి నామినేషన్‌

మెదక్‌, మహానాడు : మెదక్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ముందుగా వెంకటేశ్వరాలయంలో స్వామి వారి చెంత నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావులతో పాటు మెదక్‌ పార్లమెంటు ప్రజల ఆశీస్సులతో ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవడం జరిగిందన్నారు. కలెక్టర్‌గా ఖ్యాతి ఇచ్చిన ఈ గడ్డ నాకు రాజ కీయ జీవితం ఇవ్వాలని కోరారు. తాను మాట తప్పే మనిషిని కాదని, స్వామి వారి సాక్షిగా ట్రస్టు ఏర్పాటు చేసి యువతకు అండగా నిలుస్తామన్నారు. స్వామి వారి ఆశీస్సులతో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.