డిపాజిట్ సొమ్ము దోచేసింది విజయ సాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డే

– ఏపీ క్రికెట్ అసోసియేషన్ లో రూ.20కోట్లే ఎందుకు ఉన్నాయి?
– క్రికెటర్ హనుమ విహారి ని తన వారికోసం జగన్ రెడ్డి అణచివేయడం దారుణం
• జగన్ రెడ్డి అరాచకాలకు క్రీడాకారులు కూడా బలైపోతున్నారు అనడానికి హనుమవిహారి చేసిన వ్యాఖ్యలే నిదర్శనం
• వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి నేత్రత్వంలో ఏపీ క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ). దోపిడీకి ఆలవాలంగా మారింది
• ఏసీఏలో రూ.120కోట్ల డిపాజిట్లకు బదులు కేవలం రూ.20కోట్లే ఎందుకు ఉన్నాయి?
• ‘శాప్’ అవినీతి నిలయంగా మారిందని, సదరు విభాగం డైరెక్టర్లే చెప్పడం ఈ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం
• చంద్రబాబు పాలనలో క్రీడల్ని ప్రోత్సహించి, క్రీడాకారులకు చేయూత అందిస్తే, జగన్ రెడ్డి హాయాంలో క్రీడాకారులు బలిపశువులు అవ్వడం బాధాకరం
• హానుమ విహారికి జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి నోరువిప్పాలి
• జాతీయస్థాయి క్రికెటర్ కు అన్యాయంచేసిన సొంతపార్టీ నేతలపై క్రీడాశాఖ మంత్రి రోజా చర్యలు తీసుకోవాలి
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

రాష్ట్రంలో జగన్ రెడ్డి అరాచకాలకు క్రీడాకారులు కూడా బలైపోతున్నారు అనడానికి, ఆంధ్రా క్రికెట్ జట్టు ఆటగాడు, రంజీ టీమ్ కెప్టెన్ గా వ్యవహరించిన హనుమ విహారి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ క్రీడారంగానికి, క్రీడాకారులకు జగన్ రెడ్డి చేసిందేమీ లేదు. తాను ఏమీ చేయకపోగా.. పట్టుదల, కృషి, స్వయంప్రతిభతో ఎదిగిన క్రీడాకారుల్ని కూడా తన పార్టీ నాయకుల కోసం జగన్ రెడ్డి అణచి వేయడం దారుణాతి దారుణం. హనుమవిహారి లాంటి క్రీడాకారుడికి జరిగిన అన్యాయానికి జగన్ రెడ్డే బాధ్యుడు. మంచి క్రీడాకారుడికి అన్యాయం చేసింది కాక వైసీపీనేతలతో అతన్ని తిట్టించడం.. అతనిపై నిందలు వేయించడం జగన్ రెడ్డి ఫ్యాక్షన్ భావజాలానికి నిదర్శనం.

క్రీడల శాఖ మంత్రి రోజాకు క్రీడల గురించి.. క్రీడాకారుల గురించి ఆలోచించే తీరిక లేదు
రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రోజా ఏం మాట్లాడుతున్నారో ఆమెకే తెలియదు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ లపై విమర్శలు చేయడం తప్ప, ఆమె ఏనాడూ క్రీడారంగం గురించి..క్రీడాకారుల గురించి ఆలోచించింది లేదు. విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి తమ స్వార్థ రాజకీయాలకోసం ప్రతిభా, సామర్థ్యాలున్న క్రీడాకారుల్ని బలిచేస్తున్నారు. రూ.160కోట్లకు పైగా డిపాజిట్లు ఉండాల్సిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్లో నేడు కేవలం రూ.20 కోట్లు మాత్రమే ఉండటానికి కారణం వారు చేసిన దోపిడీ కాదా? శాప్ అవినీతి నిలయం గా మారిందని సాక్షాత్తూ శాప్ డైరెక్టర్లే మాట్లాడటం ఈ ప్రభుత్వ దోపిడీకి పరాకాష్ట.

అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందిన క్రికెటర్ భవిష్యత్ లో తాను ఏపీ తరుపున ఆడనని చెప్పడం ఈ ప్రభుత్వ దుర్మార్గపు విధానాలకు నిదర్శనం. రాష్ట్రయువత గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు బానిసలై తమ జీవితాలు నాశనం చేసుకునేలా చేసిన జగన్ రెడ్డి సర్కార్ కు క్రీడల విలువ.. క్రీడాకారుల గొప్పతనం ఏం తెలుస్తాయి?

ఆడుదాం ఆంధ్రా పేరుతో రూ.120కోట్ల ప్రజలసొమ్ము దుర్వినియోగం చేశారు తప్ప, ఒక్క క్రీడాకారుడి ప్రతిభ, సామర్థ్యమైనా వెలికితీశారా?
ఆడుదాం ఆంధ్రా అంటూ జగన్ రెడ్డి సర్కార్ రూ.120కోట్ల ప్రజాధనాన్ని దుర్విని యోగం చేసింది. పనికిరాని ఆటవస్తువులు…పరికరాలు క్రీడాకారులకు అందించి క్రీడారంగాన్ని చులకన చేశారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం వల్ల రాష్ట్రానికి సమర్థుడైన ఒక్క క్రీడాకారుడు లభించాడా? టీడీపీ ప్రభుత్వం గతంలో క్రీడాకారు ల్ని జాతీయ స్థాయిలో ప్రోత్సహించింది. చంద్రబాబు హాయాంలో రాష్ట్రం జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు వేదికగా నిలిచింది. స్టేడియాలు.. మిని స్టేడియా ల నిర్మాణానికి టీడీపీప్రభుత్వం నిధులు కేటాయించి, క్రీడాకారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించింది.

కేంద్ర ప్రభుత్వ ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి నిధులు రాబట్టింది. మంగళగిరిలో 24 ఎకరాల్లో క్రికెట్ స్టేడియం, గుంటూరు నాగార్జున యూనివర్శిటీలో లైటింగ్ తోకూడిన సింథటిక్ ట్రాక్ ఏర్పా టు చేయడం జరిగింది. కరణం మల్లీశ్వరి, కోనేరుహంపి, పీ.వీ.సింధు, పుల్లెల గోపీ చంద్ లాంటి క్రీడాకారులు జాతీయస్థాయిలో ప్రతిభచూపేలా టీడీపీప్రభుత్వం ప్రోత్సహం అందించింది.

హనుమ విహారికి ఎదురైన అవమానం.. భవిష్యత్ లో మరే ఇతర క్రీడాకారుడికి జరక్కుండా త్వరలో రాబోయే టీడీపీప్రభుత్వం చూస్తుం ది. హనుమ విహారికి జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి నోరు విప్పాలి. అలానే అతనికి అధికారపార్టీ నాయకుడు చేసిన అన్యాయంపై మంత్రి రోజా స్పందించాలి. ” అని రవీంద్ర డిమాండ్ చేశారు