జాతీయస్థాయి త్రోబాల్ లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విజయ “క్రాంతి” కాలేజ్ విద్యార్థి

చల్లపల్లి: జాతీయస్థాయి త్రో బాల్ లో విజయ క్రాంతి కాలేజ్ విద్యార్థి ఉత్తమ ప్రతిభను కనపరిచాడు.

కళాశాలలో జరిగిన కార్యక్రమంలో క్రాంతి కళాశాల ప్రిన్సిపాల్ దుట్ట శివరామ ప్రసాద్ మాట్లాడుతు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరిగిన 16వ సౌత్ జోన్ సీనియర్ నేషనల్ త్రో బాల్ ఛాంపియన్షిప్ 2024- 2025 లో ఆంధ్రప్రదేశ్ త్రో బాల్ జట్టులో క్రాంతి కాలేజ్ విద్యార్థి జనుముల ప్రబోధ్ కుమార్ (మెరకనపల్లి) ఉత్తమ ప్రతిభను కనపరిచారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు పిఈటి కొడాలి ప్రేమ్ బాబు అధ్యాపక సిబ్బంది ప్రమోద్ కుమార్ ను అభినందించారు.