విజయవాడ జూన్21 మహానాడు : గన్నవరం లోని విజయవాడ అంతర్జాతీయ విమనాశ్రయం భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సి ఐ ఎస్ ఎఫ్) తీసుకోనుంది. ఈ మేరకు తాజాగా ఎయిర్ పోర్టు అథారిటీ డీజీపీకి లేఖ రాసింది. జులై 2 నుంచి సీఐఎస్‌ఎఫ్ ఆధీనంలోకి విమానాశ్రయం భద్రత వెళ్తుందని లేఖలో పేర్కొంది. సీఐఎస్‌ఎఫ్ ఆధీనం లోకి వచ్చిన వెంటనే అక్కడ భద్రతా విధుల్లో ఉన్న రాష్ట్ర ఎస్పీఎఫ్ విభాగాన్ని ఉపసంహరించాలని ఏఏఐ లేఖలో స్పష్టం చేసింది.