విజయవాడ:మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ బదిలీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్వచ్ఛ సర్వేక్షణ్ తదితర కార్యక్రమాల్లో స్వప్నిల్ దినకర్ నేతృత్వంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పలు అవార్డులు సాధించింది.