వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు నామినేషన్‌

పల్నాడు జిల్లా వినుకొండ, మహానాడు : వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు శుక్రవారం ఆర్వో వి.సుబ్బారావుకు ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు బలపరిచారు. ఎలాంట ఆర్భాటాలు లేకుండా ఈ కార్యక్రమం కొనసాగింది. నామినేషన్‌కు ముందు వినుకొండ పాత శివాలయంలో జీవీ దంపతులు నామినేషన్‌ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. కాగా ఆయన ఈ నెల 24న రెండో సెట్‌ నామిషన్‌ దాఖలు చేయనున్నారు.