– వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం కక్కుర్తి
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం వీఐపీ దర్శన టికెట్లను వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం బ్లాక్లో అమ్ముకున్నారు. ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై భక్తులు ఆరు టికెట్లు పొందారు. ఈ ఆరు టికెట్లను రూ.65 వేలకు వైసీపీ ఎమ్మెల్సీ విక్రయించారు. ఈ సంఘటనపై టీటీడీ అధికారులకు ఓ భక్తుడి ఫిర్యాదు చేశారు. విచారణలో వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం బ్లాక్లో టికెట్లు అమ్ముకున్నారన్న విషయం నిర్ధారణ కావడంతో పోలీసులకు టీటీడీ విజిలెన్స్ వింగ్ కు ఫిర్యాదు చేశారు. ఏ1గా చంద్రశేఖర్, ఏ2గా ఎమ్మెల్సీ జకియా ఖానం, ఏ3గా ఎమ్మెల్సీ పీఆర్వో కృష్ణతేజ పేర్లను పోలీసులు కేసులో నమోదు చేశారు.