విశాఖపట్నం, మహానాడు: విశాఖపట్నంలో నాలుగు కారిడార్లుగా మెట్రో రైలు మార్గం నిర్మాణం కానుంది. కారిడార్-1: విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.40కి.మీ, 29 స్టేషన్లు, కారిడార్-2: గురుద్వారా నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5.07కి.మీ, 6 స్టేషన్లు, కారిడార్-3: తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75కి.మీ, 7 స్టేషన్లు, కారిడార్ 4: కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30.67కి.మీ, 12 స్టేషన్లు( రెండో దశలో రూ.5734కోట్లతో నిర్మిస్తారు), తొలిదశలో రూ.11,498 కోట్లతో 3 కారిడార్లు చేపడతారు.