‘విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేయాలి’

గుంటూరు, మహానాడు: విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం సెయిల్ లో విలీనం చేయాలని, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేయాలని, ప్రైవేటీకరణ విధానాలు విడనాడాలని అఖిలభారత కార్మిక సంఘాలు, రైతు సంఘాల సమన్వయ కమిటీల పిలుపు మేరకు మంగళవారం గుంటూరులోని శంకర్ విలాస్ సెంటర్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమం నికి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఆకిటి అరుణ్ కుమార్, సిఐటియు తూర్పు కమిటీ ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడువెలుగురి రాధాకృష్ణమూర్తి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి, ఎఐకెయస్ జిల్లా కార్యదర్శి కె.అజయ్ కుమార్, ఏపి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.శ్రీనివాసరావు, ఏపీ ఎఫ్ టి యు జిల్లా నాయకులు కూరపాటి కోటయ్య పాల్గొన్నారు.