గామి బ్లాక్ బస్టర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మాస్ క దాస్ విశ్వక్ సేన్ కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లకు సైన్ చేశారు. విశ్వక్ సేన్ తన12వ సినిమా కోసం దర్శకుడు రామ్ నారాయణ్‌తో చేతులు కలిపారు. #VS12 చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ గత ప్రొడక్షన్ వెంచర్ భగవంత్ కేసరి మ్యాసీవ్ బ్లాక్‌బస్టర్ సాధించి సంక్రాంతి విజేతగా నిలిచింది.
రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిండచే ఈ చిత్రంలో రామ్ నారాయణ్, విశ్వక్ సేన్‌ను మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రెజెంట్ చేయడానికి పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. విశ్వక్ సేన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిత్ర నిర్మాతలు ఆకట్టుకునే పోస్టర్ ద్వారా సినిమా టైటిల్‌ను రివిల్ చేశారు. ఈ చిత్రానికి ‘లైలా’ అనే టైటిల్ పెట్టారు. టైటిల్ పోస్టర్ కంప్లీట్ కలర్ ఫుల్ గా ఉంది. టైటిల్, మోషన్ పోస్టర్ సినిమాలో కథానాయికకు కూడా స్కోప్ ఉందని సూచిస్తున్నాయి. ఆమె పేరు తర్వాత తెలియజేయనున్నారు. అద్భుతమైన టెక్నికల్, ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌తో రూపొందనున్న ఈ సినిమాలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.