పోలింగ్‌ బూత్‌లో వాలంటీర్‌

అధికారులతో మంతనాలు
నిబంధనలు బేఖాతరు

గిద్దలూరు, మహానాడు : ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం మండల ఎంపీడీవో కార్యాలయం వద్ద బూత్‌లు 37, 39 దగ్గర ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కందులాపురం సచివా లయం 3లో పనిచేస్తున్న ఓ వాలంటిర్‌ దర్శనమిచ్చాడు. అధికారులతో మంతనాలు చేస్తూ కనిపించడంతో విమర్శలు వ్యక్తమవుతున్నారు. 100 మీటర్ల పరిధిలో రాకూడదు అన్న నిబంధనలు ఉన్నా అధికారులు మాత్రం మౌనంగా ఉన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అక్కడ ఉన్నాడని ఓటర్లు అంటున్నారు.