వీరవాసరంలో పోలింగ్ సిబ్బంది నిర్వాకం
ఓటు వేసేందుకు సాయం కోరిన వృద్ధుడికి షాక్
అమరావతి, మహానాడు : నడవలేని స్థితిలో ఉన్న వృద్ధుడు ఓటు వేసేందుకు సాయం కోరితే ఎన్నికల సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే…ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసిన వైనం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరంలో జరిగింది. గ్రామానికి చెందిన గుబ్బల నాగేశ్వరరావు ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్ దగ్గరకు వచ్చాడు. ఆయన నడవలేని స్థితిలో ఉండటంతో సిబ్బంది సాయంతో బ్యాలెట్ కేంద్రం లోకి వెళ్లాడు. మిషన్పై అవగాహన లేకపోవడంతో గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని నాగేశ్వరరావు చెబుతుండగానే పోలింగ్ సిబ్బంది ఫ్యాను గుర్తుకు ఓటు వేశారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ నాగేశ్వరరావు నిరసన వ్యక్తం చేశారు.