– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ, మహానాడు: ఏపీలో నిన్నటి నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అంబారుపేట ఐతవరం హైవే పై జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేయాలని ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధికారులకు ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి అనుకోని వరదతో అంబారుపేట ఐతవరం నేషనల్ హైవే 65 పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయిందని తెలిపారు. రెవెన్యూ, పోలీస్, నేషనల్ హైవే అధికారులు నిరంతరం పరిస్థితులను పర్యవేక్షించాలని కోరారు. నది, మునేరు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మత్స్యకారుల వేటకు వెళ్ళొద్దని సూచించారు.