పల్నాడు జిల్లా మాచర్ల, మహానాడు: నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు సోమవారం అధికారులు తాగునీటి అవసరాల కోసం నీరు విడుదల చేశారు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఈఈ శివశంకరయ్య పర్యవేక్షణలో కుడి కాలువకు నీటిని విడుదల చేశారు. రోజుకు 5,500 క్యూసెక్కుల నీరు చొప్పున మొత్తం 5 టీఎంసీల నీటిని 10 రోజుల పాటు కుడి కాలువకు విడుదల చేయనున్నారు.