Mahanaadu-Logo-PNG-Large

48 గంటలు గడువిస్తున్నాం..విత్తనాలు తెప్పించాలి

-లేదంటే రైతుల తరపున ఉద్యమిస్తాం
-ఆదిలాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌

హైదరాబాద్‌: అదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో రాష్ట్రంలో విత్తనాల కొరతపై స్పందిం చారు. రైతులకు సరిపడా విత్తనాలు ఇచ్చే స్థితి లేదు. ఏ జిల్లాలో ఏ విత్తనాలు కావాలో ప్రభుత్వానికి అవగాహన లేదు. భార్య పిల్లలతో లైన్‌లో నిలబడితే కానీ విత్తనాలు దొరికే పరిస్థితి లేదు. అదిలాబాద్‌లో డూప్లికేట్‌ విత్తనాలు దొరికాయి. దొరికిన గంటకే బెయిల్‌పై వస్తున్నారు. మీ చట్టాలు ఎక్కడ పోయాయని ప్రశ్నిం చారు. ఏ కంపెనీ ఏ రకం విత్తనాలు తయారు చేస్తుందో స్పష్టత లేదు. ఫసల్‌ బీమా పథకంలో రాష్ట్ర వాటా కట్టడంలో కూడా స్పష్టత లేదని మండిపడ్డారు. ఈ సమస్యపై చీఫ్‌ సెక్రటరీకి వినతిపత్రం ఇచ్చాం. సోనియా, రాహుల్‌, ప్రియాంక మీద ఉన్న ప్రేమ రైతుల మీద లేదు. ప్రభుత్వానికి 48 గంటలు సమయం ఇస్తున్నాం. ఏ జిల్లాలో ఏ విత్తనాలు కావాలో వాటిని అందుబాటులో ఉంచాలి. లేదంటే రైతుల తరపున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వ వైఫల్యాల మీద దృష్టిపెట్టి కాంగ్రెస్‌ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది.