మేము ఉన్నాం మీకు అండగా…

– భారీగా ఆహార పొట్లాలు సిద్ధం చేసిన మంత్రి మండిపల్లి

విజయవాడ, మహానాడు: మేము ఉన్నాం మీకు అండగా అంటూ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి వరద బాధితుల కోసం భారీ ఆహార పొట్లాలను సిద్ధం చేశారు. జక్కంపూడికి 35,000, సింగ్ నగర్ కి 50,000, విజయవాడ వెస్ట్ 15,000, గన్నవరం 5000 పంపిణీ కోసం స్వయంగా పౌష్టికాహారాన్ని తయారు చేయించి దాతృత్వన్ని చాటుకున్నారు. ఇంకా… రెండు ట్రక్కుల నిండా లక్ష మంచి నీటి వాటర్ బాటిల్స్, రెండు ట్రక్కుల నిండా ప్యాకింగ్ చేసిన 2 లక్షల యాపిల్స్, రెండు ట్రక్కుల నిండా అరటిపళ్ళు, రెండు ట్రక్కుల నిండా బిస్కెట్లు, బ్రెడ్ వంటి పౌష్టికాహారాన్ని పంపించారు. వరద ముంపు వల్ల నష్టపోయిన మేమున్నాం మీకు అండగా అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, మంత్రి నారా లోకేష్ సూచనలతో స్పందించారు. బాధితులకు కనీస ఆహార అవసరాలు నిమిత్తం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో వద్ద ఆహారం తీసుకెళ్లే వాహనాలకు జెండా ఊపి మంత్రి ప్రారంభించారు.