కావాలనే కోతలంటూ బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం
ప్రజలు తిరస్కరించినా వారికి బుద్ధి రాలేదు
గత ఏడాదితో పోలిస్తే మెరుగైన సేవలు
ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క
హైదరాబాద్, మహానాడు : రాష్ట్రంలో కరెంట్ కోతలు లేనే లేవని, పీక్ డిమాండ్‌లో కూడా నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నా మని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. బీఆర్‌ఎస్ నేతలు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అసత్య ప్రచారం చేయడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్ వస్తే కరెంటు పోతదని అసెంబ్లీ ఎన్నికల ముందు చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టి బుద్ధి చెప్పారని అయినా వారికి ఇంకా బుద్ధి రాలేదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం బీఆర్‌ఎస్ నాయకులు ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటివరకు ఐదు నెలల్లో చేసిన విద్యుత్తు సరఫరా, గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువేనని వివరించారు. 2022 డిసెంబర్‌ు నుంచి 2023 ఏప్రిల్ వరకు మొత్తం 36,207 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా జరుగగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబరు నుంచి 2024 ఏప్రిల్ 30 వరకు 38,155 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశామని వివరించారు.
ఒకే రోజున గరిష్ఠంగా 15,497 మెగావాట్ల పీక్ డిమాండ్ విద్యుత్ సరఫరా చేసిన చరిత్ర తమ ప్రభుత్వానిదని వెల్లడిరచారు. వేసవిలో అధిక డిమాండ్‌తో ఒక్కోసారి ట్రిప్పు అవటం, సాంకేతిక అవాంతరాలు తలెత్తుతాయని, సిబ్బందితో అధిగమిస్తూ ప్రజలకు అసౌకర్యం లేకుం డా సత్వర సేవలు అందిస్తున్నామని తెలిపారు. గత ఏడాది సరిగ్గా ఇదే టైమ్‌లో అంటే ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 30 వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1369 సార్లు 11 కేవీ లైన్ ట్రిప్పింగ్ అయ్యాయి. మొత్తం ఆ వారం రోజుల్లో 580 గంటలు విద్యుత్‌కు అంతరాయం వాటిల్లింది. ఇప్పుడు అదే గడిచిన వారంలో కేవలం 272 చోట్ల 11 కేవీ విద్యుత్ సరఫరా ట్రిప్పు అయింది. కేవలం 89 గంటలు మాత్రమే అంతరాయం వాటిల్లిం దని వివరించారు. గత ఏడాది అదే వారంలో లెక్కలు చూసుకుంటే అప్పుడు 301 ట్రాన్స్ ఫార్మర్లు ఫెయిల య్యాయి. ఇప్పుడు కేవలం 193 ట్రాన్స్‌ఫార్మర్లు ఫెయిలయ్యాయి. వాటిని కూడా వెంటనే మార్చి కొత్తవి బిగించి విద్యుత్తు పునరుద్ధరించాం. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వం మెరుగైన విద్యుత్తును సరఫరా చేస్తుం దని ఇంతకంటే ఏం ఆధారం కావాలని నిలదీశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కడ విద్యుత్ అంతరాయానికి సంబంధించిన ఫిర్యాదు వచ్చినా పరిష్కరించేందుకు ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.