ఏ సమస్య ఉన్నా అండగా ఉంటాం

లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుందాం
సికింద్రాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్‌
ఖైరతాబాద్‌ కార్యకర్తలతో సన్నాహక సమావేశం

హైదరాబాద్‌, మహానాడు: ఏ సమస్య ఉన్నా హైదరాబాద్‌ ప్రజలకు అండగా ఉంటాం…ఇక్కడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలిపించారు…ఈసారి లోక్‌సభ స్థానాలలో గెలిపించాలని సికింద్రాబాద్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి పద్మారావు కోరారు. పార్లమెంటు ఎన్నికల సన్నాహక కార్యక్ర మంలో భాగంగా సికింద్రాబాద్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కు మద్దతుగా పార్టీ నాయకులు మన్నే గోవర్ధన్‌రెడ్డి, దాసోజు శ్రావణ్‌, విప్లవ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ భవన్‌లో ఖైరతాబాద్‌ నియోజకవర్గ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిధిగా పద్మారావుగౌడ్‌ పాల్గొనగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్‌, ముఠా గోపాల్‌, మాగంటి గోపీనాథ్‌, కార్పొరేటర్లు మన్నే కవిత ండ్డి, వెళ్దాండ వెంకటేష్‌, మాజీ కార్పొరేటర్‌ హేమలత, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ ప్రసన్నలక్ష్మి, ఉద్యమకారులు ఉమ, కాంచన, జలాల్‌, నిసర్‌, శంకర్‌, కిరణ్‌, సారంగపాణి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావుగౌడ్‌ మాట్లాడుతూ హైదరాబా ద్‌లో జరిగిన అభివృద్ధి గురించి ప్రతిఒక్కరికీ తెలియజేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.

హైదరాబాద్‌ ప్రజలు బీఆర్‌ఎస్‌ పక్షాన ఉండి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేలుగా గెలిపించారు…వారందరికీ ఏ సమస్య ఉన్నా అండగా ఉంటామని తెలిపారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఇప్పుడు ఐదుగురు ఎమ్మెల్యేలం ఉన్నాం… కొట్లాడుదాం.. నిలబడు దాం…పార్టీని అత్యధిక మెజారిటీతో పార్లమెంట్‌ ఎన్నికలలో గెలిపించుకుందామని పిలుపు నిచ్చారు. దాసోజు శ్రావణ్‌, తలసాని శ్రీనివాసయాదవ్‌ మాట్లాడుతూ అందరికీ అందుబాటు లో ఉండి ప్రేమను పంచే మన పద్మారావు గౌడ్‌నే గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ మాట్లాడుతూ దుష్ప్రచారాలను నమ్మవద్దని మేమంతా పద్మారావు గౌడ్‌ వెంటే ఉంటామన్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మాట్లాడుతూ దానం నాగేందర్‌ చేసిన పనికి ఖైరతాబాద్‌లో పద్మారావుగౌడ్‌కు అత్యధిక మెజార్టీ రాబోతుందన్నారు. సమావేశంలో ఖైరతాబాద్‌ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.