– సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మహానాడు: జీవితంలో రిస్క్ లేకుండా గొప్ప విజయాలు సాధించలేమని.. త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులం కాలేమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మంచి లీడర్ కావాలంటే ధైర్యం, త్యాగం ఉండాలని చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో నిర్వహించిన లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. ‘‘మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్‌సింగ్, పీవీ నరసింహారావు సహా ఎంతోమంది నాయకులు మనందరికీ ఆదర్శం. నాయకత్వ లక్షణాలను వారి నుంచే నేర్చుకున్నాను. నాయకులు డబ్బు, సమయం, వ్యక్తిగత జీవితం.. ఇలా అన్నీ త్యాగం చేయాలి. మంచి లీడర్ కావాంటే ధైర్యం, త్యాగం ఉండాలి. సిగ్గుపడకుండా ప్రజలతో మమేకమవ్వాలి.
ఐఎస్‌బీలో ఉన్న వారంతా తెలంగాణ, దేశానికి అంబాసిడర్లు. హైదరాబాద్‌ను 600 మిలియన్ సిటీగా మార్చేందుకు మీ అందరి సహకారం కావాలి. తెలంగాణను ఇతర రాష్ట్రాలతో పోల్చను. న్యూయార్క్, లండన్, పారిస్‌తో పోల్చాలనుకుంటాను. మీరంతా తెలంగాణలో 2, 3 ఏళ్లు పనిచేయాలి. మా ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల తరహాలో మంచి జీతాలు ఇవ్వలేకపోవచ్చు. కానీ.. మంచి సవాళ్లు, జీవితానికి సరిపడా నాలెడ్జ్ అందిస్తుంది. దురదృష్టవశాత్తు ఒలింపిక్స్‌లో భారత్ స్వర్ణపతకాలు గెలవలేకపోయింది. అక్కడ అత్యధిక పతకాలు గెలవడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. వ్యాపారాల్లో రాణిస్తున్న వారు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలి’’అని రేవంత్ పిలుపునిచ్చారు.