అక్కులగారి విజయ్ కుమార్ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం

-ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే అరెస్టులు..నిలదీస్తే దాడులు
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

పులివెందులలో ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తున్న తెలుగు యువత నాయకుడు అక్కులగారి విజయ్ కుమార్ రెడ్డి అరెస్ట్ దుర్మార్గం. విజయ్ కుమార్ అక్రమ అరెస్టును తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు గాను అతనిపై అక్రమ కేసులు బనాయించి పోలీసులతో అతనిని వేధిస్తున్నారు. ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే పోలీసులతో వేధింపులకు గురిచేయడం వైకాపా ప్రభుత్వానికి సర్వసాధారణమైపోయింది. తెగించి ప్రభుత్వాన్ని నిలదీసిన వారపై అధికార పార్టీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారు. ఎన్నకలు అయ్యే లోపు ఇంకా ఎంతోమందిపై ఇలా అక్రమ కేసులు పెట్టి వేధిస్తారు. కార్యకర్తలెవ్వరూ భయపడకండి. మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఉంటుంది.