-త్వరలో అడ్మిషన్ షెడ్యూల్ విడుదల
-విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం
హైదరాబాద్, మహానాడు: తెలంగాణ ఈఏపీ సెట్ మొదటిసారి నిర్వహించినట్లు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఈఏపీ సెట్ ఫలితాల విడుదల అనంత రం ఆయన మాట్లాడారు. గత ఏడాది వరకు ఎంసెట్ పేరు మీద పరీక్షలు జరిగేవన్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌లో 1,00,432 మంది దరఖాస్తు చేసుకోగా 91,633 మంది, ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 2,54,750 మంది దరఖాస్తు చేసుకోగా 2,40,618 మంది హాజరైనట్లు తెలిపారు. ఈఏపీ సెట్ రాసిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. గత పదేళ్లలో లేనంతమంది ఈసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. ఒక్కో షిఫ్ట్‌లో 50 వేల మంది పరీక్ష రాశారని, గతంలో ఒక్కో షిఫ్ట్‌లో 25 వేల మంది మాత్రమే రాసేవారని తెలిపారు. ఫలితా లు చూసి విద్యార్థులు ఆందోళన చెందవద్దని సూచించారు. అడ్మిషన్ షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తామని వివరించారు.