అరవింద్ బాబుకు అండగా ఉంటాం

సమిష్టి కృషితో గెలిపించుకుంటాం : డాక్టర్ కడియాల

నరసరావుపేట టీడీపీ టికెట్ డాక్టర్ అరవింద్ బాబుకు కేటాయించడం పై టీడీపీ డాక్టర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు, డాక్టర్ వెనిగండ్ల మధుసూదన్ రావు డాక్టర్ పువ్వాడ సూర్యనారాయణ డాక్టర్ నాగోతు ప్రకాష్ డాక్టర్ కడియాల లలిత్ సాగర్ సంతోషం వ్యక్తం చేశారు. వారంతా టీడీపీ అభ్యర్ధి అరవిందబాబును కలసి మీ విజయానికి సమిష్టిగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.