చిరు వ్యాపారులకు అండగా ఉంటాం

-సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ

పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం చిరు వ్యాపారులతో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మాటామంతీ నిర్వహించారు. స్వయంగా పలకరించి వారి ఇబ్బందులు గురించి ఆరా తీశారు. చిరు వ్యాపారులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వ్యాపారు లందరూ ఈ ప్రభుత్వంలో చాలా నష్టపోయామని చెబుతున్నారని, కూటమి ప్రభుత్వం రాగానే అన్ని రకాలుగా అండగా ఉంటామని, వ్యాపారం చేసుకోవడానికి సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.