నరసరావుపేట స్టేడియం అభివృద్ధి చేస్తాం

– ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు

నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డు గల డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులతో కలిసి స్టేడియం సందర్శించారు. వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్ పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో స్టేడియం నిరాదరణకు గురైందని అన్నారు.