పుట్టపర్తిని టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతాం

– ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

పుట్టపర్తి, మహానాడు: పుట్టపర్తిని టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామని నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని బుక్కపట్నం చెరువులోని సాయి ఆక్వా బోటింగ్ ను శుక్రవారం బీసీ చేనేత సంక్షేమ శాఖ మంత్రి సవితతో పాటు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సాయి ఆక్వా బోటింగ్ నిర్వాహకులు పుట్టపర్తి కి చెందిన ఓనర్ జ్యోతి కేశవ ఆధ్వర్యంలో 27 లక్షలతో 10 ఏళ్ల లీజుకు ప్రభుత్వం నుంచి తీసుకున్నట్టు తెలిపారు.

పుట్టపర్తి చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు బోటింగ్ విహార యాత్రను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ ప్రాంతంలో బోటింగ్ ఏర్పాటు చేయడం వల్ల దేశ విదేశ భక్తులతో పాటు స్థానిక ప్రజలకు ఈ పర్యాటక కేంద్రంగా ఉల్లాసాన్ని కలిగించే విధంగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో పుట్టపర్తి నియోజకవర్గాన్ని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమే కాకుండా ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. కార్యక్రమంలో టూరిజం ఇరిగేషన్ రెవిన్యూ పోలీస్ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.