– హోంమంత్రి అనిత
కడప, మహానాడు: కడప జిల్లా బద్వేలులో ప్రేమోన్మాది పెట్రోల్ దాడి ఘటనలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందడం విషాదకరమని ఏపీ హోంమంత్రి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితుడు విఘ్నేష్ను పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. నిందితుడు, అతడికి సహకరించిన వారికి కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. బాధితురాలి కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని అనిత హమీ ఇచ్చారు.