ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు గుర్తింపుకార్డులు ఇస్తాం

ఇళ్ల స్థలాలు ఇచ్చి కమ్యూనిటీ హాలు కట్టిసాం
ఆత్మీయ సమావేశంలో ప్రత్తిపాటి పుల్లారావు

చిలకలూరిపేట, మహానాడు : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే ఆర్‌ఎంపీలు, పీఎంపీల సమస్యలన్నీ పరిష్కారిస్తామని చిలకలూ రిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. పవిత్రమైన వృత్తిలో ఉంటూ గ్రామీణ ప్రాం త ప్రజల ఆరోగ్యమిత్రులుగా పనిచేస్తున్న వారిని కాపాడుకుని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గురువారం చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆర్‌ఎంపీ, పీఎంపీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. ఆర్‌ఎంపీలు, పీఎంపీల విష యంలో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన విధానంతో ఉందన్నారు. ఇదే విషయంలో ఇప్పటికే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కూడా వారికి మెరుగైన శిక్షణ, గుర్తింపు కార్డులు అందిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వంలో వందరోజుల్లోనే ఆ హామీ అమలు చేస్తామని, కూటమి విజయం కోసం ఆర్‌ఎంపీ, పీఎంపీలు కృషి చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

ప్రాథమిక చికిత్స ద్వారా గ్రామాల్లో ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతున్న వారి సేవలను కొనియా డారు. ఎంబీబీఎస్‌, పీజీలు చేసిన వారంతా పట్టణాలు వదిలి రాని తరుణంలో అర్‌ఎంపీ, పీఎంపీలు కీలక వారధులుగా నిలిచారని కితాబిచ్చారు. అరకు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది ప్రజలు ఆ మాత్రం సేవలు కూడా అందక ఇబ్బందులు పడుతున్నారని, డోలీల్లో మోసుకెళ్లి వైద్యం అందిస్తున్నారని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు కమ్యూనిటీ హాలుతో పాటు రెండు సెంట్ల ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.

నాసిరకం మద్యం…బటన్‌నొక్కుడు మోసం

చిలకలూరిపేట్‌ నియోజకవర్గాన్ని తాను అభివృద్ధి చేసినంతగా మరెవరూ చేయలేదన్నారు. విడదల రజినీకి అవకాశం ఇస్తే ఐదేళ్లలో నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని.. దోచుకుని పారిపోయారని మండిపడ్డారు. జగన్‌ వంటి ముఖ్యమంత్రి పేదల గురించి ఆలోచించే వ్యక్తి అయితే నాసిరకం మద్యం ఎందుకు సరఫరా చేస్తారని ప్రశ్నించారు. ఆ మద్యం తాగి బడుగులు అవయవాలు చెడిపోయి మృత్యువాతపడిన దుస్థితి ఉందన్నారు. నాసిరకం మద్యంతో ఏడాదికి రూ.30 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. జగన్‌రెడ్డి బటన్‌ నొక్కుడు పెద్ద మోసమని, ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 4, 5 సార్లు బటన్‌ నొక్కారని.. కానీ ఎవరి ఖాతాల్లో డబ్బులు పడలేదన్నారు.

ఈ మధ్య ఆసరా, విద్యా దీవెన బటన్లు నొక్కినా ఎవరికీ రూపాయి కూడా పడలేదన్నా రు. 8 లక్షల వరకు సామాజిక పింఛన్లు తొలగించారని మండిపడ్డారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఇంటికి ఐదారు పథకాలు అందిన పరిస్థితి నుంచి జగన్‌ పాలనలో వాటిలో ఒకట్రెండు పథకాలకే సరిపెట్టారని, అందుకే పేదలంతా జగన్‌ను ఓడిరచాలన్న కసితో ఎదురుచూస్తున్నారన్నారు. ముస్లిం మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీల్లో అదే మార్పు మొదలైందని, నవరత్నాలు అంటూ చేసిన నవ మోసాల జగన్‌కు తగిన గుణపాఠం చెప్పే సమయం దగ్గరపడిరదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆర్‌ఎంపీలు, పీఎంపీలు పాల్గొన్నారు.