నష్టపోతున్న వ్యాపారులను ఆదుకుంటాం

– వ్యాపారుల సమస్యలు పరిష్కరిస్తాం
– ట్యాక్సుల పేరుతో జగన్ సర్కారు నిలువుదోపిడీ
– మాజీ మంత్రి, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్ధి కన్నా హామీ
– పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి పట్టణం కాకతీయ కళ్యాణ మండపంలో. ఏర్పాటుచేసిన ఫర్టిలైజర్స్ సీడ్స్ డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్, ఆత్మీయ సమావేశంలోమాజీ మంత్రి, సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు

సత్తెనపల్లి : వ్యాపార పరంగా సమస్యలు అన్నిటిని త్వరలోనే ప్రభుత్వం రాగానే పరిష్కరిస్తామని మాజీ మంత్రి, సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వంలో వ్యాపారులందరూ నష్టపోయారని. ప్రతిదానికి టాక్స్ రూపంలో ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారు. మన దేశానికి రైతన్న వెన్నెముక లాంటివాడు. అలాంటి రైతుకు మనం నాణ్యమైన సరుకు అందించాలని, వరికిపూడిసెల ప్రాజెక్టు కూడా ప్రభుత్వం రాగానే నెలల వ్యవధిలోనే పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వంలో చాలామంది చిన్న- సన్నకారు వ్యాపారస్తులు నష్టపోయారని, వాటిని ప్రభుత్వం రాగానే సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు

నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ మీ వ్యాపారాలు అన్నిటికీ మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మీకు సరైన సదుపాయాలు కల్పిస్తామని ఎరువులు అందక చాలామంది డీలర్స్ డిస్ట్రిబ్యూటర్ ఇబ్బంది పడుతున్నారని, సకాలంలో రైతులకు అందించలేక ఇబ్బందులకు గురవుతున్నారని వాటిని ప్రభుత్వం రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫర్టిలైజర్స్ సీడ్స్ డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ వ్యాపారస్తులు పాల్గొన్నారు.