Mahanaadu-Logo-PNG-Large

ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపరుస్తాం…

– ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు

నరసరావుపేట, మహానాడు: పేదల ఆకలి తీర్చే ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్ఠ పరిచి, ప్రతి ఒక్కరికీ సరుకులు అందేలా చర్యలు తీసుకుంటామని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదరవాడ అరవింద బాబు అన్నారు. పట్టణంలోనీ ఆరో వార్డలోని రేషన్ షాపుని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సరుకుల కోసం రేషన్ షాపుకు వచ్చిన ప్రజలను సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో కార్డుదారులకు ఎనిమిది రకాల సరుకులు అందిస్తే జగన్ రెడ్డి మొత్తం నాశనం చేశారని విమర్శించారు. కందిపప్పు, పంచదార లాంటి సరుకులు అన్ని ఎత్తేసి కేవలం బియ్యానికి పరిమితమయ్యారన్నారు. చివరికి రేషన్ సరుకుల ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచారని, ఇళ్ళ వద్దకే బియ్యమని హడావుడి చేసి వాహనాల కొనుగోలు జేబులు నింపుకున్నారని ఆరోపించారు. మల్ళీ సరుకులన్నీ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం… పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వం తక్షణ కర్తవ్యంగా పనిచేస్తోందని ఎమ్మెల్యే అరవింద బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.