త్వ‌ర‌లోనే వీఆర్ స్కూల్‌, కాలేజ్‌ రెసిడెన్షియ‌ల్ ఓపెన్ చేస్తాం

– వ‌చ్చే అక‌డ‌మిక్ ఇయ‌ర్ నుంచే ప్రారంభించేందుకు కృషి చేస్తాం
– మున్సిప‌ల్ శాఖ‌లో అనేక అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ్‌
– లేఅవుట్‌ల‌లోనే అధికం
– ఎవ‌రిని వ‌దిలి పెట్టం
– ఇప్ప‌టికే త్రిమెన్ క‌మిటీ వేశాం
– నివేదిక‌లు రాగానే…లీగ‌ల్ యాక్ష‌న్ తీసుకుంటాం
– రాష్ట్ర పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌
– నెల్లూరులోని మంత్రి క్యాంప్ కార్యాల‌యంలో… అధికారుల‌తో స‌మీక్షించిన మంత్రులు ఆనం, నారాయ‌ణ‌, అబ్ధుల్ అజీజ్
– అధికారుల‌కి దిశా నిర్దేశం

నెల్లూరు : రాష్ట్రంలోని మున్సిప‌ల్ శాఖ‌లో అనేక అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని…ప్ర‌ధానంగా లేఅవుట్‌ల విష‌యంలో చాలా జ‌రిగాయ‌ని…ఇప్ప‌టికే త్రిమెన్ క‌మిటీ వేశామ‌ని…నివేదిక‌లు రాగానే…లీగ‌ల్ యాక్ష‌న్ తీసుకుంటామ‌ని…ఎవ‌రిని వ‌దిలి పెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని… రాష్ట్ర పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ హెచ్చ‌రించారు.

నెల్లూరు మంత్రి క్యాంప్ కార్యాల‌యంలో…రాష్ట్ర దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖామంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, మంత్రి పొంగూరు నారాయ‌ణ‌, టీడీపీ పార్ల‌మెంట్ అధ్య‌క్షులు అబ్ధుల్ అజీజ్‌లు… అధికారులతో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌ధానంగా మున్సిప‌ల్ శాఖ‌లో జ‌రిగిన అవినీతి, అవ‌క‌త‌వ‌క‌లు, లేఅవుట్ల విష‌యంపై అధికారుల‌తో చ‌ర్చించారు.

ఈ సంద‌ర్భండా మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని మున్సిప‌ల్ శాఖ‌లో అనేక అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని…ప్ర‌ధానంగా లేఅవుట్‌ల విష‌యంలో చాలా జ‌రిగాయ‌న్నారు. ఒక్క నెల్లూరు జిల్లానే కాద‌ని…అనేక జిల్లాల్లో …అర్బ‌న్ అథారిటీస్‌, మున్సిపాల‌టీల్లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని…వాటిపైన‌ ఎంక్వైరీ చేయాల‌ని ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీకి ఆదేశాలు ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు.

అలాగే నెల్లూరు, క‌డ‌ప జిల్లాల‌కి త్రిమెన్ క‌మిటీ వేశార‌న్నారు. ఆ నివేదిక‌లు వ‌చ్చిన త‌రువాత….ఎలాంటి లీగ‌ల్ యాక్ష‌న్ తీసుకోవాలో తీసుకొని ముందుకెళుతామ‌ని స్ప‌ష్టం చేశారు. మున్సిప‌ల్ శాఖ‌లో అవ‌క‌త‌వ‌క‌లు పాల్ప‌డిన వారిని వ‌దిలి పెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని నారాయ‌ణ హెచ్చ‌రించారు.

వీఆర్ లా కాలేజీ మిద్దెపైన సుమారు 300 మంది విద్యార్థుల కోసం రెసిడెన్షియ‌ల్ క్యాంప్ పెట్టామ‌ని గుర్తు చేశారు. విద్యార్థులంద‌రూ బాగా చ‌దువుకోవాల‌న్న ఉద్దేశంతో నారాయ‌ణ విద్యా సంస్థ‌ల నుంచి స్టాఫ్ ని పెట్టి వారికి నెల‌కి రూ. 6 ల‌క్ష‌లు జీతాలు కూడా ఇచ్చామ‌ని చెప్పారు. విద్యార్థులంద‌రికి ఐఐటీ, నీట్ లో కోచింగ్ కూడా ఇప్పించామ‌ని తెలిపారు. సుమారు 150 మంది పిల్ల‌లు ఐఐటీ, ఎన్ఐటీ, త్రిబుల్ ఐటీ, బిట్స్ పిలానీ, గ‌వ‌ర్న‌మెంట్ కాలేజీల్లో మెడిక‌ల్‌లో చేరడం చాలా సంతోష‌మ‌న్నారు.

అప్పుడు అబ్ధుల్ అజీజ్ నెల్లూరు న‌గ‌రంలో ఊరేగింపు కూడా చేశార‌న్నారు. అలాంటి రెసిడెన్షియ‌ల్ ని వైసీపీ ప్ర‌భుత్వం తీసేయ‌డం దారుణ‌మ‌న్నారు. దానిని మ‌ళ్లీ టేక‌ప్ చేస్తాన‌ని ఎల‌క్ష‌న్ చెప్పాన‌ని…సుదీర్ఘ‌గంగా ఆలోచిస్తున్నాన‌ని…కాలేజే కాద‌ని…స్కూల్ న‌ర్స‌రీ నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు విద్యార్థుల కోసం ఓ మోడ‌ల్ స్కూల్‌గా చేస్తామ‌ని చెప్పారు.

స్ల‌మ్ ఏరియాల్లో నివ‌సించే పేద‌లు, నిరుపేద‌లంద‌రికి ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్‌లో ఎలాంటి విద్య‌ను అందిస్తున్నారో… అంత‌కుమించి నిరుపేద‌ పిల్ల‌లంద‌రికి హై క్వాలిటీ హెడ్యుకేష‌న్ అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇప్ప‌టికే దీనిపై నేను, మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డిలు చ‌ర్చించామ‌న్నారు. ఈ అక‌డ‌మిక్ ఇయ‌ర్ కాద‌ని…వ‌చ్చే ఏడాది నుంచి ప్రారంభించేందుకు కృషి చేస్తామ‌ని పేర్కొన్నారు.

అనంత‌రం దేవదాయ‌శాఖ‌మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి మాట్లాడుతూ…. ఆత్మ‌కూరు మున్సిపాలిటీలో చేప‌ట్టాల్సిన ప‌నుల‌పై చ‌ర్చించ‌డం జ‌రిగింద‌న్నారు. ప్ర‌ధానంగా మున్సిపాలిటీలో తాగునీటి స‌మ‌స్య‌పై పుర‌పాల‌క‌శాఖ‌ మంత్రితో చ‌ర్చించామ‌ని చెప్పారు. అదేవిధంగా అర్థాంత‌రంగా మున్సిపాలిటీలో ఆగిపోయిన భ‌వ‌నాల స్థితిగ‌తుల‌పై మాట్లాడామ‌న్నారు.

మ‌రో వారం రోజుల్లోపు స‌మ‌గ్రంగా తాగునీటి స‌ర‌ఫ‌రా జ‌రిగేలా చూడాల‌ని పుర‌పాల‌క‌శాఖ‌మంత్రి ఆదేశించార‌ని ఆనం చెప్పారు. మున్సిపాలిటీకి ఏ విధంగా ఆదాయం వ‌స్తుందనే అంశంపై చ‌ర్చించామ‌న్నారు. రెవెన్యూ, మున్సిప‌ల్ శాఖ‌ల అధికారుల అనుమ‌తి పొందిన‌ లేఅవుట్స్ ఎన్ని ఉన్నాయ‌ని, వాటిలో వ‌చ్చే రెవెన్యూ ఏమైంద‌ని చ‌ర్చించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. అదేవిధంగా మున్సిపల్ బ‌స్టాండ్‌లో ఉన్న పాత‌భ‌వ‌నాన్ని తొల‌గించి, కొత్త బ‌స్టాండ్‌ను నిర్మించ‌డం జ‌రిగింద‌ని, ఎవ‌రు ఆదేశాలు మంజూరు చేశారు.

దానికి ఎలా నిధులు స‌మ‌కూరాయ‌ని, అందుకు సంబంధించిన వివ‌రాల‌ను మంత్రి అడిగార‌ని చెప్పారు. ఖాళీగా ఉన్న మున్సిప‌ల్ షాపింగ్ కాంప్లెక్స్ పై అడిగితే అధికారులు స‌మాధానం చెప్ప‌లేని స్థితిలో ఉన్నార‌ని ఆనం తెలిపారు. మ‌రోసారి క్షుణ్ణంగా మున్సిప‌ల్ శాఖ అధికారులు, నాయ‌కుల‌తో మాట్లాడి స‌మ‌గ్ర అభివృద్ధికి కృషి చేస్తామ‌ని చెప్పారు. నెల్లూరుపాలెం నుంచి ఆత్మ‌కూరుకు వ‌చ్చే నాలుగు లైన్ల ర‌హ‌దారి స్థితిగ‌తుల‌పై చ‌ర్చించామ‌న్నారు.

ఆత్మ‌కూరు మున్సిపాలిటీలో నుడా నుంచి కొంత‌మేర నిధులు ఇస్తామ‌ని, ఆ మేర‌కు ఎక్క‌డ త‌క్ష‌ణ అవ‌స‌రం ఉందో ఆ నిధులు ఖ‌ర్చు చేయాల‌ని పుర‌పాల‌క శాఖ మంత్రి నారాయ‌ణ ఆదేశించార‌ని ఆనం చెప్పారు. అలాగే సోమ‌శిల ప్రాజెక్ట్ అప్రాన్ కొట్టుకుపోతే గ‌త ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. అతిత్వ‌ర‌లో ఇరిగేష‌న్ శాఖ మంత్రి, అధికారుల‌తో చ‌ర్చించి సోమ‌శిల ప్రాజెక్ట్ భ‌ద్ర‌త‌పై మాట్లాడుతామ‌ని ఆనం చెప్పారు.

గ‌డిచిన ఐదేళ్లుగా ఒక్క‌పైసా కూడా ప్రాజెక్ట్ కోసం ఖ‌ర్చు చేయ‌క‌పోవ‌డం బాధాక‌ర‌మ‌ని మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి మండిప‌డ్డారు. జిల్లా వ‌ర‌ప్ర‌సాధిని అయిన సోమ‌శిల ప్రాజెక్ట్‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం మంచిప‌ద్ద‌తి కాద‌న్నారు. జిల్లా ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ధ్యేయంగా టీడీపీ ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంద‌న్నారు