-ఆయన అరాచకాలకు దళిత, గిరిజనులు బలయ్యారు
-టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ధారునాయక్
అమరావతి: వైసీపీ మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలకు దళిత, గిరిజనులు సైతం బలయ్యారని, ఆయన శిక్ష అనుభవించక తప్పదని టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ధారునాయక్ తెలిపారు. శుక్రవారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డి గూడెంలో 8 మంది గిరిజన ఏజెంట్లపై పిన్నెల్లి పెంపు డు గూండాలు అత్యంత నీచంగా దాడికి పాల్పడ్డారు. కేతావత్ రేఖ్యా నాయక్ అనే గిరిజ నుడిని బరిసెతో కడుపులో పొడిచారు. ఆయన గుంటూరులో చికిత్స పొందుతున్నాడు. వారి ఇళ్లపై పడి కుటుంబసభ్యులను కొట్టారు. ఊరిలోని సెల్‌ఫోన్ టవర్ల సిగ్నల్స్ రాకుండా వైర్లను కత్తిరించారు. మిగిలిన గిరిజనులు ప్రాణ భయంతో పారిపోయారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరలా తిరిగివచ్చి ఇళ్లపై పడి చంపుతాడనే భయాందోళనలో ఉన్నారు. జగన్‌రెడ్డి అరాచక పాలన లో గిరిజనులు పోలింగ్ ఏజెంట్లుగా కూడా కూర్చునే హక్కు లేదా? అని ప్రశ్నిం చారు. పిన్నెల్లిపై కొత్త ప్రభుత్వంలో సిట్ వేసి విచారణ చేసి కోర్టుల ద్వారా శిక్షపడేలా చేస్తామని తెలిపారు.