-కూటమి రాగానే జైలుకు పంపుతాం
-వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు
వినుకొండ: కూటమి ప్రభుత్వంలో అమరావతి సామగ్రి దొంగలందరి భరతం పట్టడం ఖాయమని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు హెచ్చరించా రు. ఐదేళ్లుగా రాజధాని ప్రాంతాన్ని వైకాపా దొంగల ముఠా దోచుకుంటోందని వాళ్లందరిపై కూటమి ప్రభుత్వంలో కఠినచర్యలు తప్పవన్నారు. కేవలం చంద్రబా బుకు పేరొస్తుందనే ఒకే ఒక్క కారణంతోనే అమరావతి ఉసురు తీసిన అధికార వైకాపా శాశ్వత సమాధికి ఇక్కడి శిథిలాలతోనే కట్టడం ఖాయమన్నారు. అది గమనించే ఓటమి అక్కసుతో అమరావతి సామగ్రిని తరలిస్తున్నారని జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కనీసం 150 -160 స్థానాలతో ప్రజా ప్రభుత్వ కొలువుదీరుతుందని, రాజధానిని దోచుకున్న వారికి అరదండాలు వేయించి తీరుతామని హెచ్చరించారు.