Mahanaadu-Logo-PNG-Large

చంద్రబాబు గెలుపు కోసం కృషిచేస్తాం

సౌత్‌ ఇండియన్‌ ముస్లిం పర్సనల్‌ లా బోర్డు వెల్లడి
తెలుగుదేశానికి మద్దతు ప్రకటన

మంగళగిరి: సౌత్‌ ఇండియన్‌ ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సభ్యులు బుధవారం తెలుగుదేశానికి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు టీడపీఈ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును హైదరాబాద్‌ లోని ఆయన నివాసంలో బుధవారం కలిసి మద్దతు తెలిపారు.. ఈ సందర్భంగా బోర్డు ప్రెసిడెంట్‌ రాషిద్‌ షరీఫ్‌ మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. సెక్యులరిజా నికి చంద్రబాబు ఐకాన్‌గా నిలిచారని ప్రశంసించారు. మత సామర్యాన్ని కాపాడటంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ప్రజా రాజధానిగా అమరావతి నిర్మాణంతోనే అన్ని వర్గాలు అభివృద్ధికి సాధ్యమ న్నారు. 2024 టీడీపీ మేనిఫెస్టో మైనారిటీ వర్గాల అభ్యున్నతికి దోహదపడుతుందని ఈ సందర్భంగా చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.

లాల్‌జాన్‌ బాషా వంటి నాయకులను రాజ్యసభకు పంపించింది తెలుగుదేశం పార్టీనే అని గుర్తు చేసుకున్నారు. దక్షిణ భారతదేశంలో ముఫ్తీలు, ఉలేమాలు, మత పెద్దలు వంటి వారితో సౌత్‌ ఇండియన్‌ ముస్లిం పర్సనల్‌ లా బోర్డుకు సత్సంబంధాలున్నాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు మా ఆర్గనైజేషన్‌ ద్వారా శాయశక్తులా కృషి చేస్తామని వివరించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లింలు ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటువేయాలని విజ్ఞప్తి చేశారు.