కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేస్తాం..

– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

వీరులపాడు, మహానాడు: రాష్ట్ర పునర్నిర్మా ణమే లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. వీరులపాడు మండలం జయంతి గ్రామంలో ఎస్డీఏ చర్చి సంఘ కాపరి, సంఘస్తులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సౌమ్యను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజలకు సంక్షేమ పాలన అందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. దగా కోరు వైసీపీకి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు.

జయంతి గ్రామంలో భారీ మెజారిటీ అందించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎన్నికల ప్రచార పర్యటనలో వచ్చిన సందర్భంగా ఫీజు రీయింబర్స్ మెంట్ అందలేదని విద్యార్థులు వినతులు అందజేశారని కూటమి ప్రభుత్వంలో వాటి పరిష్కార దిశగా చర్యలు చేపడతామని సూచించారు.

సుమారు ఎనిమిది వందల సభ్యులున్న సెవెంత్ డే అడ్వింటిస్ట్ చర్చి నిర్మాణమునకు నిధులు మంజూరు కొరకు సంఘ కాపరి మరియు సంఘస్తులు విన్నవించగా వెంటనే దాని స్పందిస్తూ సహకారాన్ని అందిస్తానని వారికి హామీ ఇచ్చారు. గ్రామాలతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తాను చిత్తశుద్ధితో పనిచేస్తామని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో గ్రామ, మండల పార్టీ నాయకులు, కూటమి నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సరితకు ఎమ్మెల్యే రూ. 10వేల ప్రోత్సాహకం

జయంతి గ్రామంలో పాము సరిత అనే విద్యార్థికి పదో తరగతిలో 564 మార్కులు సాధించినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసారు. ఇంకా ఉన్నత చదువులు అభ్యసించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరుతూ, సరితకు ప్రోత్సాహకరంగా తంగిరాల సౌమ్య రూ.10వేలను అందజేశారు.